Rapaka Varaprasad: వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తా: రాపాక సంచలనం

Rapaka Varaprasad: మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తానని చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Oct 2024 6:55 PM IST
Rapaka Varaprasad: వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తా: రాపాక సంచలనం
X

Rapaka Varaprasad: మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. రెండు మూడు రోజుల్లో తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన ఆదివారం చెప్పారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో జరిగిన జనసేన సమావేశంలో ఆయన పాల్గొనడం చర్చకు దారి తీసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి ఆయన జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ, కొంతకాలానికే ఆయన వైఎస్ఆర్ సీపీకి మద్దతు పలికారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ టికెట్ ఆయనకు దక్కలేదు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు వైఎస్ఆర్ సీపీ టికెట్ ఇచ్చింది. అమలాపురం ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story