కొలువుదీరనున్న ఏపీ కేబినెట్.. నేడు 25 మంది మంత్రుల ప్రమాణస్వీకారం...

AP New Cabinet: ఉ.11గంటల 31నిమిషాలకు ప్రమాణస్వీకారం...

Shireesha
Published on: 11 April 2022 7:18 AM IST
AP New Cabinet Oath Ceremony Today 11 04 2022 at Amaravathi Secretariate | Live News
X

కొలువుదీరనున్న ఏపీ కేబినెట్.. నేడు 25 మంది మంత్రుల ప్రమాణస్వీకారం...

AP New Cabinet: ఏపీలో కొత్త మంత్రివర్గం మరికాసేపట్లో కొలువుదీరనుంది. మొత్తం 25 మందితో కూడిన జంబో టీమ్ మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. వెలగపూడి సచివాలయం వేదికగా జరగనున్న ఈ మంత్రుల ప్రమాణ స్వీకారానికి అధికార యాంత్రాంగం అన్ని ఏర్పా్ట్లు చేసింది. ఇప్పటికే ఈ కొత్త మంత్రుల జాబితాకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ హరిచందన్ ఈ ఉదయం వీరందరి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

మొత్తం 25 మందితో ప్రమాణ స్వకారం, అధికారికంగా శాఖల కేటాయింపు, అట్టహాసంగా జరగనుంది. ఇందులో భాగంగా ఈ ఉదయం 11గంల31నిమిషాలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఈ మంత్రివర్గ స్రమాషకా కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి అధికారులు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు. ఇన్విటేషన్‌లు పాసులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. మరోవైపు వెలగపూడి సచివాలయం వద్ద ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసిన అధికారులు..

బ్లూబుక్‌లోని నిబంధనల ప్రకారం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. పాస్ లు, ఇన్వటేషన్లు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్‌, సీఎంతో నూతన మంత్రివర్గ సభ్యులు గ్రూపు ఫోటో దిగేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులను ఆదేశించారు. ఇక జిగ్నేట్ కాబడిన వారికి ఆహ్వానం పలకడం, రవాణా సౌకర్యం ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగం పర్యవేక్షిస్తోంది

మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయం వద్ద అందుకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం, వివిధ శాఖల అధికారులు ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ప్రమాణం చేయనున్న కొత్త మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, పాత్రికేయులు కూర్చునేందుకు పలు గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

Shireesha

Shireesha

Next Story