AP Municipal Elections: ఓటు హక్కు వినియోగించుకున్న పవన్‌కల్యాణ్‌

AP Municipal Elections: పవన్‌కల్యాణ్‌తోపాటు బూత్‌లోపలికి వెళ్లేందుకు అభిమానులు యత్నం

Samba Siva Rao
Published on: 10 March 2021 10:15 AM IST
AP Municipal Elections 2021
X

మునిసిపల్ ఎన్నికలు 

AP Municipal Elections:ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ పటమటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 9వ వార్డులోని 4వ పోలింగ్‌ స్టేషన్‌లో ఆయన ఓటు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి. పవన్‌తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పోలింగ్‌ కేంద్రంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పవన్‌ వచ్చే సరికి పోలింగ్‌ కేంద్రం రద్దీగా ఉండటంతో పోలీసులు ఆయన్ను ప్రత్యేకంగా లోపలికి పంపించి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story