Live Updates: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

Arun Chilukuri
Updated on: 10 March 2021 5:23 PM IST

AP Municipal Elections 2021 : ఏపీలోని పుర, నగర పాలక పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం 2,214 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Live Updates

  • 10 March 2021 9:29 AM IST

    AP Municipal Elections 2021: కడప జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

    కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి. జిల్లాలో పులివెందుల మున్సిపాలిటీ ఏకగ్రీవం కావడంతో కడప నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరులలో సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉండటంతో సుమారు 2వేల మందితో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 10 March 2021 9:27 AM IST

    AP Municipal Elections 2021: వైసీపీ కౌన్సిల్‌ అభ్యర్థికి పోలీసులకు మధ్య వాగ్వాదం

    తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో పోలింగ్‌ కొనసాగుతుంది. అయితే 7వ పోలింగ్‌ బూత్‌ వద్ద వైసీపీ కౌన్సిల్‌ అభ్యర్థికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు ఇచ్చిన పాస్‌ను చూపించిన పోలీసులు పోలింగ్‌ కేంద్రంలోకి పంపించలేదు. దీంతో పోలీసులతో వైసీపీ కౌన్సిల్‌ అభ్యర్థి వాగ్వాదానికి దిగాడు.

  • 10 March 2021 8:41 AM IST

    AP Municipal Elections 2021: చిత్తూరు జిల్లాలో కొనసాగుతన్న పోలింగ్‌

    చిత్తూరు జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జిల్లాలో 344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 137 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు, 97 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

  • 10 March 2021 8:37 AM IST

    AP Municipal Elections 2021: పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

    శ్రీకాకుళం జిల్లాలో మూడు మున్సిపాల్‌టిలకు పోలింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అత్యంత సమస్యాత్మంక ప్రాంతమైన పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story