ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలు కొట్టివేసిన హైకోర్టు

AP Municipal Elections 2021: High Court to give verdict today on SEC orders
x

ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలు కొట్టివేసిన హైకోర్టు

Highlights

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు...

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. గత మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలుచోట్ల తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుమతించారు.

దీంతో నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఎస్‌ఈసీ నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎస్‌ఈసీ ఆదేశాలను నిలుపుదల చేసింది. వాలంటీర్లపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు నిలుపుదల చేసింది. వాలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories