AP Municipal Elections: బోణి కొట్టిన టీడీపీ

AP Municipal Election: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దూసుకుపోతోంది.

Samba Siva Rao
Updated on: 14 March 2021 2:24 PM IST
Tadipatri municipality Win Tdp
X

టీడీపీ జెండా

AP Municipal Election: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దూసుకుపోతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ అతధ్యిక స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ 5 వార్డులకే పరిమితం అయితే.. టీడీపీ ఇప్పటికే 15కు పైగా స్థానాల్లో గెలుపొందింది. ఏక గ్రీవాలతో కలుపుకున్నా ఇక్కడ వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే.. దీంతో టీడీపీ ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

తాడిపత్రి మున్సిపాలిటీలోని 24వ వార్డులో మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. వైసీపీ 5 వార్డులకే పరిమితం అయితే టీడీపీ ఇప్పటికే 15కు పైగా స్థానాల్లో గెలుపొందింది. ఏక గ్రీవాలతో కలుపుకున్నా ఇక్కడ వైసీపీ అధికారంలోకి రావడం సంక్లీష్టంగా మారింది. దీంతో అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించినట్లే.

మరోవైపు తాడిపత్రిలో టీడీపీ తరపున గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీ వైపు చూస్తున్నట్ల ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. వైసీపీ అభ్యర్థులే తమతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. తాడిపత్రిలో విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజవర్గం అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జేసీ స్పష్టం చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story