ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్

X
Highlights
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారయ్యింది. గతేడాది నవంబర్ 1న పోతుల ...
Arun Chilukuri6 Jan 2021 10:00 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారయ్యింది. గతేడాది నవంబర్ 1న పోతుల సునీత రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 11న నోటిఫికేషన్, ఇక జనవరి 18న నామినేషన్ల చివరి తేదీ. జనవరి 28న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు.
Web TitleAP MLC by-election schedule released
Next Story