ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌

Arun Chilukuri
Published on: 2 Sept 2020 1:35 PM IST
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌
X

Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. అదే విధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో, ఆయన హైదారాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా కరోనా సోకింది. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. అంతేకాదు వారంతా క్వారంటైన్ లో ఉండాలని కూడ ఆయన కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story