గుళ్లుగోపురాల పేరుతో మతవిద్వేశాలు రెచ్చగొడుతున్నారు-బొత్స

గుళ్లుగోపురాల పేరుతో మతవిద్వేశాలు రెచ్చగొడుతున్నారు-బొత్స
x

బొత్స సత్యనారాయణ ఫైల్ ఫోటో

Highlights

సంక్షేమం అభివృద్ధితో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

సంక్షేమం అభివృద్ధితో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అనంతపురం సమీపంలో ఉప్పరపల్లి లే ఔట్ లో ఇళ్లపట్టాల పంపిణీలో మంత్రి బొత్స పాల్గొన్నారు. గుళ్లు, గోపురాల పేరుతో ముందుకు వస్తూ మతవిద్వేశాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. గందరోగళం సృష్టించి రాజకీయ లభ్దిపొందాలని చూస్తున్నారని బొత్స ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రపన్నుతున్నారని అన్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై సోమువీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడం సోమువీర్రాజు స్థాయికి తగదని హితవు పలికారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దుష్టశక్తులు ఎంతటివారైనా వదిలపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆలయాలపై దాడులకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.ఆలయాలపై దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం డీజీపీ చేసిన తప్పా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసు వ్యవస్థ తమ పని తాము చేసుకుంటూ పోతుంటే.. ప్రతిపక్ష పార్టీలు ఏకంగా డీజీపీనే టార్గెట్‌ చేయడం వారి బరితెగింపుకు నిదర్శనమని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories