Alla Nani: చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు: ఆళ్ల నాని

Alla Nani: కరోనా సంక్షోభ సమయంలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: ఆళ్ల నాని

Arun Chilukuri
Updated on: 28 April 2021 4:21 PM IST
Alla nani Comments On chandra babu
X

ALLA NANI FILE PHOTO

Alla Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆళ్ల నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా విజృంభిస్తున్న వేళ చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదన్న మంత్రి.. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని విమర్శించారు.

కరోనా కట్టడిపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం జరిగింది. కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్‌పై చర్చించినట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి.. బెడ్స్, ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కరోనా పేషెంట్లు పెరిగేకొద్దీ బెడ్స్‌కు డిమాండ్ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో 33వేలకు పైగా కోవిడ్ సెంటర్లలో బెడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి ఆళ్ల నాని.. రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నట్లు స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story