ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌

Arun Chilukuri
Published on: 1 Sept 2020 12:06 PM IST
ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌
X

Shariff Mohammed Ahmed: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. అదే విధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ష‌రీఫ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పలువురు రాజకీయ నేత‌లు ఆకాక్షించారు.

మ‌రోవైపు ఏపీలో క‌రోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. కేసుల విష‌యంలో త‌మిళ‌నాడును వెన‌క్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది ఏపీ. మ‌హారాష్ట్ర ఫ‌స్ట్ ప్లేసులో కొనసాగుతోంది. ఆగ‌స్టు 31 తేదీ సాయంత్రానికి ఆంధ్రాలో 4,34,771 పాజిటివ్ కేసుల న‌మోద‌య్యాయి. ఇందులో 1,00,276 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,30,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3969కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story