AP Junior Doctors: సమ్మె సైరన్‌ మోగించిన జూడాలు

AP Junior Doctors: ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. సీనియర్‌, జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మె లోకి దిగ‌నున్నారు

Samba Siva Rao
Updated on: 7 Jun 2021 5:08 PM IST
AP Junior Doctors Strike Notice to Govt
X

జూనియర్ డాక్టర్స్ స్ట్రైక్ (ఫైల్ ఇమేజ్)

AP Junior Doctors: ఏపీలో జూడాలు స‌మ్మెకు స‌రైన్ మోగించారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. సీనియర్‌, జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మె లోకి దిగ‌నున్నారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విధులు బహిష్కరించనున్నట్లు వెల్ల‌డించారు తమకు కొవిడ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టయిఫండ్‌లో టీడీఎస్‌ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెల 9న కొవిడ్‌తో సంబంధం లేని విధులు, 10న కొవిడ్‌ విధులు, 12న కొవిడ్‌ అత్యవసర విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారించాల‌ని కోరుతున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story