AP Inter Results 2021: ఏపీలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

AP Inter Results 2021: ఏపీలో ఇంటర్మీడియట్ సెకండీయర్ ఫలితాలను రాష్ర్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

Arun Chilukuri
Updated on: 23 July 2021 5:57 PM IST
AP Inter Second Year Results 2021 Released
X

AP Inter Results 2021: ఏపీలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

AP Inter Results 2021: ఏపీలో ఇంటర్మీడియట్ సెకండీయర్ ఫలితాలను రాష్ర్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. విద్యార్ధులందరూ పాస్ అయినట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని కోరనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని వివరించారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు ప్రకటించామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేశామని తెలిపారు. ఫలితాలపై విద్యార్ధులకు అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో పదవ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్ లైన్లోనే నిర్వహిస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story