Anitha: వైసీపీ హయాంలో గంజాయి రాజ్యమేలింది.. ఇప్పుడు ఉక్కుపాదం మోపాం: హోంమంత్రి అనిత కీలక ప్రకటన!

Anitha: వైసీపీ హయాంలో గంజాయి రాజ్యమేలింది.. ఇప్పుడు ఉక్కుపాదం మోపాం: హోంమంత్రి అనిత కీలక ప్రకటన!
x
Highlights

Anitha: రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చామని గర్వంగా చెప్పగలమని హోంమంత్రి అనిత అన్నారు.

Anitha: రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చామని గర్వంగా చెప్పగలమని హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి నిర్మూలన, రవాణాను అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కిపాదం మోపినట్లు తెలిపారు.

వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా, సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశామని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories