Andhra News: జీవో నెం.1 ఈనెల 23వరకు సస్పెండ్‌ చేసిన హైకోర్టు

Andhra News: ఆంక్షలు విధిస్తూ జీవో1ను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Jyothi
Published on: 12 Jan 2023 4:55 PM IST
AP High Court Suspended Go No 1 Till 23rd of This Month
X

Andhra News: జీవో నెం.1 ఈనెల 23వరకు సస్పెండ్‌ చేసిన హైకోర్టు

Andhra News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. జీవో నెంబర్ వన్‎ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‎పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జీవో 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న ఉన్నత న్యాయస్థానం.. ఈనెల 23 వరకు జీవోను సస్పెండ్ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. ఇటీవల కందుకూరు, గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లో తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్‎ను తీసుకొచ్చింది. సభలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఆంక్షలు విధిస్తూ జీవో1ను జారీ చేయగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా.. ఈనెల 23 వరకు జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Jyothi

Jyothi

Next Story