మే 9 నుంచి జూన్‌ 10 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు.. వెకేషన్‌ కోర్టుల తేదీలు...

AP High Court - Summer Holidays: అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటు...

Shireesha
Updated on: 8 May 2022 9:41 AM IST
AP High Court Summer Holidays From May 9th 2022 to June 10 2022 | Live News Today
X

మే 9 నుంచి జూన్‌ 10 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు... 

AP High Court - Summer Holidays: కోర్టులకు మే 9 నుంచి జూన్‌ 10వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్‌ 13నుంచి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్‌ కోర్టులు ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొదటి దశ వెకేషన్‌ కోర్టులు ఈ నెల 12, 19, 26వ తేదీల్లో విచారణలు చేపడతాయి.

న్యాయమూర్తులు జస్టిస్‌ కె.మన్మథరావు, జస్టిస్‌ తర్లా డ రాజశేఖరరావు, జస్టిస్‌ చీమలపాటి రవి సింగిల్‌ జడ్జిగా విచారణలు జరుపుతారు. రెండో దశ వెకేషన్‌ కోర్టులు జూన్‌ 2, 9వ తేదీల్లో విచారణ జరగనున్నాయి. జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణలు నిర్వహిస్తారు.

Shireesha

Shireesha

Next Story