Breaking News: అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరట

Breaking News: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 19 March 2021 5:26 PM IST
AP High Court stay on CID case Registered Against Chandrababu
X

Breaking News: అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరట

Breaking News: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుపై సీఐడీ విచారణకు స్టే విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఉదయం నుంచి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా సీఐడీ అధికారులపై న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసు విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీ అధికారులను అడిగిన న్యాయమూర్తి.. ప్రాధమిక విచారణలో ఇప్పటివరకూ ఏం గుర్తించారని ప్రశ్నించారు. అయితే తొలిదశ విచారణలో వివరాలు చెప్పలేమన్న సీఐడీ అధికారులు పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. పూర్తి వాదనలు విన్న అనంతరం సీఐడీ విచారణకు స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story