Andhra Pradesh: ఆమంచి కృష్ణమోహన్‌కు హైకోర్టు షోకాజ్ నోటీసులు
Andhra Pradesh: ఆమంచి అసైన్డ్‌లాండ్ యాక్ట్‌కు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్
ఆమంచి కృష్ణమోహన్ -హై కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా )
Andhra Pradesh: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఏపీ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమంచి అసైన్డ్ లాండ్ యాక్ట్ కు విరుద్ధంగా వ్యవహరించారంటూ నాయుడు నాగార్జునరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆయన నివాసం ఉన్న స్థలంలో 11 సెంట్లు కొనుగోలు చేసిన దాంట్లో అసైన్డ్ భూమి ఉందని పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయాన్ని పరిశీలించి అసైన్డ్ చట్టం మేరకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారాయన.ఎందుకు పిటిషన్ కొట్టివేయాలో వివరణ ఇవ్వాలని ఆమంచికి హైకోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Next Story




