దమ్మాలపాటిపై ఏసీబీ దర్యాప్తు, విచారణ నిలిపివేత

ఏపీ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు స్టే విధించింది..
ఏపీ హైకోర్టులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు స్టే విధించింది.. ఈ మేరకు ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నాలుగు వారాలకు వాయిదా వేసింది. స్టే విధించడమే కాకుండా.. ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ మీడియాలో కూడా రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఉండొద్దని.. ఇందుకు ఏపీ ప్రభుత్వం , డీజీపీదే బాధ్యత అని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ప్రభుత్వ పెద్దలు తనను వేధిస్తున్నారని.. అందువల్ల తదుపరి చర్యలు తీసుకోకుండా ఆపేలా ఆదేశించాలని దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దమ్మాలపాటి పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఈ కేసుపై స్టే విధించింది. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆయన తోపాటు మొత్తం 13 మందిపై మంగళవారం ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. ఈ భూ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌ను మొదటి నిందితునిగా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలిద్దరి తోపాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ నమోదు చేసిన కేసులో విచారణను హైకోర్టు నిలిపివేయడం విశేషం.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMTపవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?
27 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా...
27 Jun 2022 2:30 PM GMTరేపు పారిస్‌కు వెళ్లనున్న సీఎం జగన్
27 Jun 2022 2:15 PM GMT