AP High Court: కోవిడ్‌ బిల్లుల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: నోడల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో బిల్లుల చెల్లింపులు జరగాలని ఆదేశం

Sandeep Eggoju
Updated on: 31 May 2021 11:36 AM IST
AP High Court Key Commands on Covid Bills in Andhra Pradesh
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP High Court: ఏపీ హైకోర్టు కోవిడ్‌ చికిత్స బిల్లుల విషయంలో కీలక ఉత్వర్వులు జారీ చేసింది. రోగుల నగదు చెల్లింపులు నోడల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో జరగాలని కోర్టు ఆదేశించింది. రోగులకు బిల్లులు ఇచ్చేముందు నోడల్‌ అధికారి సైన్‌ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు వేస్తున్నారా.. లేదంటే అధిక బిల్లులు మోపుతున్నారా అని నోడల్‌ అధికారులు పరిశీలించాలని కోర్టు తెలిపింది. అలాగే ప్రతి కోవిడ్‌ ఆస్పత్రిలో డిస్‌ప్లే బోర్డ్స్‌ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు అమలు జరిగేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఎంహెచ్‌వోకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story