Kondapalli Elections: కొండపల్లి ఎన్నికపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

AP High Court Hearing on Kondapalli Elections
x

హైకోర్టు లో కొండపల్లి మునిసిపల్ ఎన్నికల విచారణ (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Kondapalli Elections: సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ఎన్నిక వివరాలు

Kondapalli Elections: ఏపీలో ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నిన్న పైర్తైంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడయో తీశారు. ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారులు నేడు హైకోర్టుకు నివేదించనున్నారు. సీల్డ్ కవర్‌లో ఎన్నికల వివరాలు అందిస్తారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. హైకోర్టు తీర్పుపై కొండపల్లి చైర్మన్ పీఠం ఎవరికి దక్కుంతుందోన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

మొత్తం 29 వార్డుల్లో 14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ గెలిస్తే ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఆ గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మి టీడీపీకి మద్దతు పలికారు. దీంతో టీడీపీ బలం 15కు.. వైఎస్సార్‌సీపీ బలం 14కు చేరింది. ఇక టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటుతో టీడీపీకి 16 ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటుతో వైసీపీకి 15 ఓట్లు అయ్యాయి. అయితే చైర్మన్ సీటు తమదేనంటూ టీడీపీ థీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు చైర్మన్ పీఠం ఎవరికి దక్కినా సహకారం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories