AP High Court: ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అంగళ్లు కేసులో కీలక పరిణామం

AP High Court: దీనిపై వెంటనే ఆదేశాలు తీసుకోవాలని సీఐడీ, హోంశాఖ లాయర్లకు హైకోర్టు ఆదేశం

Shekhar G
Published on: 11 Oct 2023 12:10 PM IST
AP High Court Hearing On Chandrababu Anticipatory Bail Petition
X

AP High Court: ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అంగళ్లు కేసులో కీలక పరిణామం

AP High Court: ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అంగళ్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టును కోరారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇస్తే.. విచారణకు సహకరిస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. దీనిపై వెంటనే ఆదేశాలు తీసుకోవాలని సీఐడీ, హోంశాఖ లాయర్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

Shekhar G

Shekhar G

Next Story