AP High Court: ఆనందయ్య మందు పంపిణీ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

AP High Court: చుక్కల మందును ఐదు ల్యాబుల్లో టెస్ట్ చేయించామన్న ప్రభుత్వ న్యాయవాది

Sandeep Eggoju
Updated on: 22 Jun 2021 10:01 AM IST
AP High Court Hearing on Anandayya Medicine Distribution Petitions
X
ఏపీ హై కోర్ట్ (ఫైల్ ఇమాజ్)

AP High Court: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. చుక్కల మందును ఐదు ల్యాబుల్లో టెస్ట్ చేయించామన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. అయితే చుక్కల మందులో కంటికి హాని కలిగించే పదార్థముందని ల్యాబ్‌లు నివేదిక ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు. చుక్కల మందును ఆయుష్‌ రిసెర్చ్ సెంటర్‌లో టెస్ట్ చేయించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. ల్యాబ్‌ల నివేదికను సమర్పించాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story