మలుపు తిరిగిన వివేకా హత్య కేసు

మలుపు తిరిగిన వివేకా హత్య కేసు
x
Highlights

వైఎస్ వివేకానంద హత్య కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే సీబీఐకి అందజేయాలని పులివెందుల...

వైఎస్ వివేకానంద హత్య కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే సీబీఐకి అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌కి ఆదేశాలిచ్చింది. వివేకా హత్యకు సంబంధించి తమకు రికార్డులు ఇవ్వాలని సీబీఐ అధికారుల బృందం పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, రికార్డులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో సీబీఐ బృందం రాష్ట్ర హైకోర్టులో 15 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories