డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కు హైకోర్టు అనుమతి

X
Highlights
ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. డాక్టర్ సుధాకర్ తల్లి...
Arun Chilukuri5 Jun 2020 6:43 AM GMT
ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. సుధాకర్‌ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని సుధాకర్ తల్లి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న తర్వాత .. వైద్యుడు సుధాకర్ డిశ్చార్జికి ఉన్నత న్యాయస్థానం సమ్మతించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు సహకరించాల్సిందిగా సుధాకర్‌కు హైకోర్టు సూచించింది.
Web TitleAP high court has allowed doctor Sudhakar discharge from hospital
Next Story