ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

X
Highlights
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి నిధుల విడుదలపై ప్రభుత్వం సహకరించడం లేదని...
Arun Chilukuri3 Nov 2020 7:59 AM GMT
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి నిధుల విడుదలపై ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎక్కడ సహకరించడం లేదో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు అడగ్గా.. ఈసీకి రూ.40 లక్షలు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయడం లేదని నిమ్మగడ్డ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఈసీకి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని హైకోర్టు వెలువరించింది. హైకోర్టు రాజ్యాంగ బద్ద సంస్థలను కాపాడుకోకపోతే ప్రజా స్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని హైకోర్టు అబిప్రాయపడింది. మాజీ జస్టిస్ కనగరాజ్ లాయర్ ఖర్చు వివరాలను కోర్టుకు తెలియ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Web TitleAP High Court gives verdict on Nimmagadda Ramesh's petition, orders govt to submit a report
Next Story