ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్‌

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్‌
x

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్‌

Highlights

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని హైకోర్టు ప్రకటించింది....

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని హైకోర్టు ప్రకటించింది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సవాల్‌ చేస్తూ 16 పిటిషన్లు దాఖలు కాగా.. అన్ని పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు, 14న కౌంటింగ్ జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories