Eluru Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Eluru Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
x

ఏపీ హైకోర్టు (ఫైల్ ఇమేజ్ )

Highlights

ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఏపీ హైకోర్టు కొట్టేసింది.

Eluru Corporation: ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని ధర్మాసనం తెలియజేసింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 23కి వాయిదా వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై సోమవారం సింగిల్‌ బెంచ్‌ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ స్టేను ఎత్తివేస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories