టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట

Acham Naidu: టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 20 Dec 2021 5:12 PM IST
AP High Court Give Permission to Acham Naidu to go Abroad
X

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట

Acham Naidu: టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఎత్తివేసింది. ఈఎస్‌ఐ స్కాం కేసులో అచ్చెన్నాయుడికి గతంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏసీబీ కోర్టులో విచారణ ముగిసే వరకు దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు ఆదేశించింది.

విదేశాలకి వెళ్లాలంటే ఖచ్చితంగా ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలని కండీషన్ పెట్టింది. ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలన్న కండీషన్ ఎత్తివేయాలని అచ్చెన్నాయుడు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేసింది. దీంతో అచ్చెన్నాయుడు విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story