Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజుకు హైకోర్టు షాక్

Raghurama Krishnam Raju: నర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజుకు హైకోర్టు షాకిచ్చింది.

Arun Chilukuri
Published on: 15 May 2021 3:07 PM IST
AP High court Dismisse Raghu Rama Krishnam Raju Petition
X

Raghurama Krishnam Raju: రఘురామకృష్ణం రాజుకు హైకోర్టు షాక్

Raghurama Krishnam Raju: నర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజుకు హైకోర్టు షాకిచ్చింది. రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం సీఐడీ కోర్టులో ప్రయత్నించామని ధర్మసనం ఆదేశించింది. సెషన్ కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని ఆదేశించింది. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకొచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అరెస్ట్ చేశారు కాబట్టే తాము హైకోర్టుకు వచ్చామని రఘురామ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రఘురామ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించలేదు ప్రాథమిక విచారణ, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని రఘురామకృష్ణరాజు తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఎంపీ హోదా వ్యక్తిని కారణాలు లేకుండా రిమాండ్‌కు పంపాలనుకోవడం చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. వాదనలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story