హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ..ఆ భూములపై..

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ..ఆ భూములపై..
x
Highlights

AP High Court directs government not to use mining lands for house site pattas: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు...

AP High Court directs government not to use mining lands for house site pattas: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన భూసేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల కోసం కేటాయించారని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించొద్దని ఆదేశించింది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories