AP High Court: ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు

AP High Court: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసిన హైకోర్టు

Sandeep Eggoju
Published on: 21 May 2021 12:09 PM IST
AP High Court Cancelled  Parishad Elections in Andhra Pradesh
X
పరిషత్ ఎన్నికలు రద్దు చేసిన హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదన్న హైకోర్టు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల క్రితమే ఏపీలో పరిషత్ ఎన్నికలు నిర్వహించగా.. నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ జారీచేశారని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇవాళ తుదితీర్పు వెలువరించిన హైకోర్టు ఎన్నికలను రద్దు చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story