వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట
x
Highlights

పంచాయతీ ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ ఆదేశాలు...

పంచాయతీ ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో రమేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడొచ్చని స్పష్టం చేసింది. అయితే ఎస్ఈసీని, ఎన్నికల ప్రక్రియను కించపరిచేలా మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో మాట్లాడవద్దని జోగి రమేష్‌ను ధర్మాసనం ఆదేశించింది. జోగి రమేష్‌ వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిందిగా ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories