AP High Court: ఏపీ హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన

AP High Court: హైకోర్టు జడ్జీలు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌లను బదిలీ చేయడంపై అడ్వకేట్ల నిరసన

Jyothi
Published on: 25 Nov 2022 3:00 PM IST
AP High Court  Advocates Protest On Judges Transfer
X

AP High Court: ఏపీ హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన

AP High Court: ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జీలను బదిలీ చేయడంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌లను బదిలీ చేయడంపై అడ్వకేట్లు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు జడ్జీలను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిన్న సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరేసి న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. జస్టిస్ దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేశ్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.

Jyothi

Jyothi

Next Story