Anandayya Natu Mandu: విచారణకు అనుమతించిన హైకోర్టు

Anandayya Natu Mandu: ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Arun Chilukuri
Published on: 25 May 2021 5:39 PM IST
AP High Court Admits petition over AnandayyaS Natu Mandu
X

ఏపీ హైకోర్టు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Anandayya Natu Mandu: ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటిషన్లపై విచారణకు అనుమతించిన హైకోర్టు ఈనెల 27న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. మందు పంపిణీకి ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించాలన్న పిటిషనర్లు శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలన్నారు. లోకాయుక్త ఆదేశాలతో మందు పంపిణీని ఆపామని పోలీసులు చెబుతున్నారని, కానీ లోకాయుక్తకు ఆ అధికారం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. అయితే, ఆనందయ్య మందు పంపిణీని ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదన్న పిటిషనర్లు ఎలాంటి ఆదేశాల్లేకుండా నిలిపివేయడం సరికాదన్నారు. ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయడంతో ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story