ఏపీలో మందుబాబులకు శుభవార్త.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Arun Chilukuri
Published on: 2 Sept 2020 12:25 PM IST
ఏపీలో మందుబాబులకు శుభవార్త.. హైకోర్టు కీలక ఆదేశాలు..
X

High Court: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్. మద్యంకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని హైకోర్టు కలిగించింది. ఇది మందుబాబులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిల్ తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story