ఎస్ఈసీ, వైసీపీ సర్కారుకూ మధ్య ఆరని చిచ్చు

ఎస్ఈసీ, వైసీపీ సర్కారుకూ మధ్య ఆరని చిచ్చు
x
Highlights

*మంత్రి పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్టు చేయాలంటూ ఎస్‌ఈసీ ఆదేశాలు *ఎస్‌ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తామని ప్రభుత్వం వెల్లడి *హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ప్రభుత్వం

ఎస్ఈసీకి, వైసీపీ సర్కారుకూ మధ్య సాగుతున్న పోరు పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. మంత్రి పెద్దిరెడ్డి అధికారులపై చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ సీరియస్‌ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్టు చేయాలంటూ ఎస్‌ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో ఇటు ప్రభుత్వం కూడా భగ్గుమంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తామని ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. అదే సమయంలో నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు నిలిపేయాలంటూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ, రేపు కోర్టు సెలవులు కావడంతో హౌస్‌ మోషన్‌లో తమ పిటిషన్ విచారించాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories