ఏపీలో పదో తరగతి పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

Arun Chilukuri
Published on: 20 Jun 2020 9:15 AM IST
ఏపీలో పదో తరగతి పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!
X

ఏపీలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో, రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని గురు, శుక్రవారాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు చర్చించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పది పరీక్షలు రద్దు చేశాయి. అంతర్గత పరీక్షల్లో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగా ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించాయి. ఏపీలోనూ ప్రతిపక్షాలు ఇదే డిమాండ్ చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story