బట్టబయలైన అమరావతి కుంభకోణం.. వేలకోట్ల అవినీతి జరిగినట్లు తేల్చిన..

బట్టబయలైన అమరావతి కుంభకోణం.. వేలకోట్ల అవినీతి జరిగినట్లు తేల్చిన..
x
Highlights

అమరావతిలో భూముల కొనుగోళ్ల అంశంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమవుతోందనే టాక్...

అమరావతిలో భూముల కొనుగోళ్ల అంశంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయనిపుణులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు.

అమరావతి ప్రకటనకు ముందుకు జరిగిన భూ కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో దీనిపై సీబీఐ విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అమరావతి రాజధాని పరిధిలో 4 వేల ఎకరాలు ఎవరెవరు కొన్నారో కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ సబ్ కమిటీ నివేదికలో పలువురు టీడీపీ నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు, వారి బినామీలు పెద్ద ఎత్తున భూములను కొనుగోళ్లు చేశారని ఏపీ మంత్రులు ఆరోపించారు. ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొనుగోలు చేశారనే దానిపై కూడా అసెంబ్లీలో పేర్లు వెల్లడించారు. అయితే ప్రభుత్వం ఆరోపణలను ఖండించిన టీడీపీ నేతలు దీనిపై విచారణ చేసుకోవాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి భూములకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారి పేరుతో కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను సిద్ధం చేసింది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో ముఖ్యమైన వారి పేరుతో ఆరుగురి పేర్లను కేబినెట్ సబ్ కమిటీ పొందుపరించింది. అందులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన వేమూరు రవికుమార్, పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది. లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను కూడా ఆ జాబితాలో పొందుపరిచింది.

వీరితోపాటు ఎవరెవరు ఏయే పేర్లతో భూములను కొనుగోలు చేశారో తెలియజేస్తూ మరికొన్ని పేర్లను కూడా జోడించింది. అందులో మాజీ మంత్రి నారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను కూడా అందులో పొందుపరిచింది. సీఆర్డీఏ సరిహద్దులను మార్చడం ద్వారా టీడీపీకి చెందిన మరికొందరు నేతలు, కంపెనీలకు లబ్ధి చేకూర్చిందంటూ మరో లిస్టును పొందుపరిచింది. మొత్తంమీద టీడీపీ ప్రభుత్వం ఐదు సంస్థలకు 850 ఎకరాల భూములను కేటాయించిందని, అందులో కూడా భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని కేబినెట్ సబ్ కమిటీ తమ రిపోర్టులో పొందుపరిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories