Home > ఆంధ్రప్రదేశ్ > AP Govt Releases GO on Coronavirus Deaths: కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
AP Govt Releases GO on Coronavirus Deaths: కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం: జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

X
Highlights
AP Govt Releases GO on Coronavirus Deaths: ఏపీలో కరోనా మృతులకు సంబంధించి ప్రభుత్వం కీలక...
Arun Chilukuri4 Aug 2020 7:25 AM GMT
AP Govt Releases GO on Coronavirus Deaths: ఏపీలో కరోనా మృతులకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15వేలు ఇవ్వాలని, అలాగే ప్లాస్మాను దానం చేసిన వారికి ఐదు వేలు అందివ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. దీని కోసం జిల్లా కలెక్టర్లకు రూ. 12 కోట్ల చొప్పున విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ను ఆదేశించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Web TitleAP Govt Releases GO on Coronavirus Deaths
Next Story