ఏపీలో డీఎడ్ పరీక్షలు వాయిదా

ఏపీలో డీఎడ్ పరీక్షలు వాయిదా
x
Highlights

ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సోమ‌వారం నుండి జ‌ర‌గాల్సిన డీఎడ్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం...

ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సోమ‌వారం నుండి జ‌ర‌గాల్సిన డీఎడ్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి జరగవలసిన డీఎడ్ పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓవైపు భారీ వ‌ర్షాలు, మ‌రోవైపు భారీగా పెరిగిపోతున్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో విద్యార్థుల త‌ల్లితండ్రుల నుండి వ‌చ్చిన విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను మ‌ళ్లీ ఎప్పుడు నిర్వ‌హించేది ప‌రిస్థితిని స‌మీక్షించాక ప్ర‌క‌టిస్తామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories