ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు న్యూ ఇయర్‌ కానుక

ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు న్యూ ఇయర్‌ కానుక
x
జగన్‌
Highlights

నూతన సంవత్సర కానుకగా ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణాశాఖలో విలీనం చేస్తూ నోటిఫికేషన్‌...

నూతన సంవత్సర కానుకగా ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణాశాఖలో విలీనం చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కార్మికులను ప్రభుత్వంలో విలీనం) చట్టం 2019 ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సుమారు 52వేల మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణాశాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా అధికారులకు హోదాలు మారనున్నాయి. రేపు సాయంత్రం విజయవాడ బస్టాండ్‌లో కృతజ్ఞతసభను ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories