సీబీఐకు కర్నూల్ సుగాలి ప్రీతి హత్యకేసు

సీబీఐకు కర్నూల్ సుగాలి ప్రీతి హత్యకేసు
x
సీబీఐకు కర్నూల్ సుగాలి ప్రీతి హత్యకేసు
Highlights

కర్నూలుకి చెందిన బాలిక సుగాలి ప్రీతి హత్యకేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.

కర్నూలుకి చెందిన బాలిక సుగాలి ప్రీతి హత్యకేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.. 2017లో తానూ చదువుకుంటున్న స్కూల్లో అనుమానాస్పద స్థితిలో ప్రీతి ఉరి వేసుకొని మృతి చెందిందని స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. అయితే తన కూతురుది ఆత్మహత్య కాదని, అత్యాచారం చేసి చంపారని తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. అప్పటినుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది...

ఈ కేసుకు సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.37ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కర్నూలు పర్యటనలో భాగంగా బాలిక కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి న్యాయం చేయాలని కోరగా, ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని, తప్పకుండా న్యాయం జరుగుతుందని జగన్ భరోసా ఇచ్చారు..కేసును సీబీఐకి అప్పజెప్పడంతో ప్రీతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే దీనిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూల్‌లో మార్చ్ లో స్పందించిన సంగతి విధితమే.. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు. లేకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని పవన్ వెల్లడించారు. దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ కేసు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ ఆ రోజు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories