Land Resurvey: ఏపీలో ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం

AP Govt Focus on Land Resurvey Ysr Jagananna Sasvatha Bhoo Hakku Bhoo Raksha Scheme
x

Ysr Jagananna Sasvatha Bhoo Hakku Bhoo Raksha Scheme:(The Hans India)

Highlights

Land Resurvey: “వైఎస్సార్‌ జగనన్న భూ రక్ష- శాశ్వత భూ హక్కు” పథకం ద్వారా ఆధునిక టెక్నాలజీతో రీసర్వేకు శ్రీకారం చుట్టింది.

Land Resurvey: ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఇప్పటికీ మనలను కలవరపరిచేది మన ల్యాండ్ రికార్డ్స్. భూముల సర్వే శతాబ్దాల నుంచి అలాగే నడుస్తోంది గాని సమస్యలు పరిష్కారం కావటం లేదు. కబ్జాలు, డబల్ రిజిస్ట్రేషన్లుతో చాలామంది నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యలన్నిటిని పరిష్కరించి.. సమగ్రంగా భూరికార్డులను రూపొందించడానికి ఏపీ సర్కార్ సంస్కరణలు చేపట్టింది. ప్రతి భూమికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలని నిర్ణయించి సర్వే సెటిల్‌మెంట్‌, లాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ ఓ ప్రకటనలో విడుదల చేశారు. గత డిసెంబరు 21న రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే ప్రారంభమైందని, 17,500 గ్రామాలు, 110 పట్టణ ప్రాంతాల్లో రీ సర్వే ద్వారా యాజమాన్య హక్కుల నిర్ధారణ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది. "వైఎస్సార్‌ జగనన్న భూ రక్ష- శాశ్వత భూ హక్కు" పథకం ద్వారా ఆధునిక టెక్నాలజీతో ఈ రీసర్వే ప్రక్రియ చేపట్టినట్లు వారు ప్రకటనలో వెల్లడించారు.

తొలివిడతగా రెవెన్యూ డివిజెన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైందని, క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన వచ్చిన తర్వాత మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో రీ సర్వే చేస్తామని వివరించారు. ఇప్పటి వరకు 51 గ్రామాల్లోని 63,433 ఎకరాలకు సంబంధించిన డ్రోన్‌ ఇమేజెస్‌ ప్రింటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. 40 గ్రామాలకు సంబంధించి సరిహద్దులు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాల్లో డ్రోన్‌ ప్లైయింగ్‌ జరుగుతుందని, సర్వే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories