logo
ఆంధ్రప్రదేశ్

AP Govt Employees: సమ్మెకే సై అన్న ఏపీ ఉద్యోగులు

AP Govt Employees: సమ్మెకే సై అన్న ఏపీ ఉద్యోగులు
X
Highlights

AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సై అన్నాయి.

AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సై అన్నాయి. ముందు నుంచి చెబుతున్నట్టే సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేశారు. తాము ఎందుకు సమ్మె చేయాల్సి వస్తోంది. సమ్మె విరమించుకోవాలి అంటే తమ డిమాండ్లు ఏంటని వివరిస్తూ మూడు పేజీలతో కూడిన నోటీసులు ప్రభుత్వానికి అందజేశారు. మొత్తం 12 ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతకాలు చేసి ఆ నోటీసు అందజేశారు. ఇక ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు.

జీఏడీ కార్యదర్శి శశిభూషన్‌కు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ సమ్మె నోటీసులు అందించారు. ఈ నెల ఆరో తేది అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు తమ ఉద్యమ కార్యచరణను కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతోనే తాము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని సమ్మె నోటీసులో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.


Web TitleAP govt Employees to go on Strike From Feb 7
Next Story