ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా

AP Govt cancels private covid care centers permissions: ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా...
AP Govt cancels private covid care centers permissions: ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూల్ చేస్తున్నారని రోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ జరిపింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో విజయవాడలోని ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతిని రద్దు చేస్తూ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నిబంధనల ఉల్లంఘన, అధిక ఫీజులు వసూలు చేసిన రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ అనుమతులను అధికారులు రద్దు చేశారు. దీంతోపాటు ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్‌కు చెందిన ఐరా హోటల్, ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య , హోటల్ సన్ సిటీ అనుమతులను అధికారులు రద్దు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.