ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
x
Highlights

ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ...

ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో రాష‌్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సభ్యులుగా అన్ని మతాల నుంచి ఒక్కో ప్రతినిధిని చేర్చింది. ఆలయాలపై దాడుల వెనుక కుట్ర ఉందన్న సీఎస్ ఆదిత్యనాథ్ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్ర కమిటీలో హోం, సాధారణ పరిపాలన, దేవాదాయ, మైనార్టీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎస్ మాట్లాడారు. కమిటీలు తరచూ సమావేశమవుతాయని చెప్పారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారన్నారు. ఈ కమిటీలు రాష్ట్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయని సీఎస్‌ చెప్పారు. కమిటీలకు ప్రస్తుతానికి ఎలాంటి కాలపరిమితి లేదని.. ప్రజలకు భరోసా కల్పించేందుకే కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు, మత సామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories