Tirumala: టీటీడీ పాలకమండలిలో మరొకరికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల

TTD Board Members List: తిరుమల టీటీడీ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Nov 2024 7:42 AM IST
Tirumala: టీటీడీ పాలకమండలిలో మరొకరికి చోటు.. మొత్తం 29 మందితో జీవో విడుదల
X

TTD Board Members List: తిరుమల టీటీడీ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టీటీడీ పాలకమండలిలో మొత్తం 25 మంది సభ్యులను ఏర్పాటు చేయనున్నది. మూడు రోజుల క్రితం 24 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. తిరుపతికి చెందిన సీనియర్‌ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి పాలక మండలిలో చోటు కల్పించింది.

అలాగే పాలకమండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవదాయశాఖ కార్యదర్శిని, టీటీడీ ఈవో, తుడా చైర్మన్‌ను చేర్చింది. బీఆర్ నాయుడు చైర్మన్‌గా అధికారులతో కలిపి మొత్తం 29 మందితో పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నుంచి 5 మంది కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల ఒక్కక్కరి చొప్పున టీటీడీ పాలకమండలిలో అవకాశం కల్పించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story