Dasara Holidays 2022: ఏపీలో పాఠ‌శాల‌ల‌కు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

AP Govt. Announces Dasara Holidays to Schools from September 26
x

Dasara Holidays 2022: ఏపీలో పాఠ‌శాల‌ల‌కు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

Highlights

Dasara Holidays 2022: ఏపీలో పాఠ‌శాల‌ల‌కు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

Dasara Holidays 2022: ద‌స‌రా పండుగ‌ను పుర‌స్కరించుకుని ఏపీలోని పాఠ‌శాల‌ల‌కు సెల‌వుల‌ను ప్రక‌టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 26 నుంచి ఏపీలో ద‌సరా సెల‌వులు మొద‌లు కానున్నాయి. అక్టోబ‌ర్‌ 6 వ‌ర‌కు సెల‌వుల‌ను ప్రక‌టించిన ప్రభుత్వం.. అక్టోబ‌ర్ 7న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నట్లు ప్రక‌టించింది. మొత్తంగా 11 రోజుల పాటు పాఠశాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26 నుంచి ద‌స‌రా సెల‌వులను ప్రభుత్వం ప్రక‌టించ‌గా... పాఠ‌శాల‌ల‌కు మాత్రం 25నే సెల‌వులు ప్రారంభం కానున్నాయి. ఇక క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6 వరకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం త‌న ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పాఠ‌శాల‌లు కూడా ఇత‌ర‌త్రా పాఠ‌శాల‌ల మాదిరే అక్టోబ‌ర్ 7న పునఃప్రారంభం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories