Biswabhusan Harichandan: ఢిల్లీకి ఏపీ గవర్నర్ హరిచందన్.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ

Biswabhusan Harichandan: సోమవారం వరకూ ఢిల్లీలోనే బిశ్వభూషణ్...

Shireesha
Published on: 23 April 2022 7:53 AM IST
AP Governor Biswabhusan Harichandan Delhi Tour | AP Live News
X

Biswabhusan Harichandan: ఢిల్లీకి ఏపీ గవర్నర్ హరిచందన్.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ

Biswabhusan Harichandan: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఉదయం ఆయన ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇక సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో హరిచందన్ సమావేశం కానున్నారు. సోమవారం వరకూ గవర్నర్ హరిచందన్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో గవర్నర్ హరిచందన్ పాల్గొననున్నారు.

ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు.. ఇప్పుడు ఏపీ గవర్నర్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నారు. ప్రధానితో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా అంశాలు ప్రస్తావనకు వస్తాయా అన్నది చూడాలి.

Shireesha

Shireesha

Next Story